పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా

- September 28, 2021 , by Maagulf
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని సంభోదిస్తూ రాజీనామా లేఖ రాసిన ఆయన... "రాజీ పడడం వల్ల వ్యక్తి మనస్సాక్షి పతనమవుతుంది. నేను పంజాబ్ భవిష్యత్తు, పంజాబ్ ప్రజల సంక్షేమం అనే ఎజండాపై ఎప్పుడూ రాజీ పడలేను. అందుకే పంజాబ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. నేను కాంగ్రెస్‌కు నా సేవలు కొనసాగిస్తాను" అన్నారు.

అంతకు ముందు పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హరీష్ రావత్ "వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ నాయకత్వంలో పోరాడుతాం" అని అన్నారు.

సిద్ధూ రాజీనామాపై మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్పందిస్తూ "నేను చెప్పాను. ఈ మనిషికి స్థిరత్వం లేదు. సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌కు తగడు" అని ఆయన ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com