నెట్టింట సందడి చేస్తున్న 'హ్యాండ్ ఆఫ్ గాడ్'

- September 28, 2021 , by Maagulf
నెట్టింట సందడి చేస్తున్న \'హ్యాండ్ ఆఫ్ గాడ్\'

హైదరాబాద్: అంతరిక్షం ఎప్పుడూ ఆశ్చర్యపరిచే సబ్జెక్ట్. సరే, మీరు నాసా యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఫాలో అవుతుంటే అంతరిక్షంలో జరిగే అసాధారణ సంఘటనలతో మీరు మరింత ఆశ్చర్యపోతారు.

ఇప్పుడు, ఇన్‌స్టాగ్రామ్‌లో నాసా తాజా పోస్ట్‌తో నెటిజన్లు అయోమయంలో పడ్డారు. మొదటి చూపులో, ఫోటో అపారమైన విశ్వ హస్తంలా కనిపిస్తుంది, అది అంతరిక్షం యొక్క లోతులో విస్తరించి ఉంది. ఇక నెటిజన్లు దీనిని ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ అని పేరుపెట్టసారనుకోండి!

విషయమేంటంటే, సూపర్నోవా పేలుడులో ఒక నక్షత్రం చనిపోవడం వల్ల చెయ్యి ఆకారం ఏర్పడింది అని 'Space.com' వివరించారు. భారీ పేలుడు మూలంగా పల్సర్ అని పిలువబడే బంగారు వర్ణం గల ఆకారం వచ్చినట్టు చంద్ర బృంద సభ్యులు 'chandra.si.edu' పై వివరించారు.

ఈ పేలుడులోని పల్సర్‌ని PSR B1509-58 అంటారు. ఇది వ్యాసం 19 కిమీ మరియు భూమి నుండి 17,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్రాన్ని షేర్ చేస్తున్నప్పుడు, నాసా ఇలా వివరించింది: “ఈ చిత్రాలలో బంగారంలో కనిపించే చేతి ఆకారపు నిర్మాణం, ఒక నక్షత్రం పేలిన తర్వాత మిగిలి ఉన్న #పల్సర్ ద్వారా ఎగిరిన శక్తి & కణాల నిహారిక. PSR B1509-58 అని పిలువబడే పల్సర్ దాదాపు 19 కిలోమీటర్లు (12 మైళ్ళు) వ్యాసం కలిగి ఉంది మరియు ఇది సెకనుకు దాదాపు 7 సార్లు తిరుగుతోంది! (Sic)

మరి ఈ ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ చిత్రం నెట్టింట చేస్తున్న హడావిడి సబబే కదండీ..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com