జగన్ సర్కారుపై పోరుకు సై అంటున్న పవన్
- September 28, 2021
జగన్ సర్కారుపై పోరుకు సై అంటే సై అంటున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. వైసీపీ సర్కార్ '''పాలసీ ఉగ్రవాదం''' కారణంగా అన్ని రంగాలు, వర్గాలు నాశనమవుతున్నాయని పవన్ తాజాగా ట్వీట్ చేశారు. ఇటీవల సినీపరిశ్రమ పట్ల ప్రభుత్వ తీరును కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలు కూడా వివాదాస్పదం కావడంతో, వాటిపైనా పోరాటానికి సిద్దమవుతున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మటన్ షాపులు, ఫిష్ మార్కెట్లపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం వంటి వాటిని కూడా ప్రశ్నించబోతున్నారు. సినిమా టికెట్ల అమ్మకాల విషయంలో పారదర్శకత అంటున్న ప్రభుత్వం.. మద్యం దుకాణాల్లో అదే పారదర్శకత ఎందుకు పాటించడంలేదని కూడా నిలదీస్తున్నారు. అలాగే ఇసుక పాలసీ వల్ల అసంఘటితరంగ కార్మికులు పడుతున్న ఇబ్బందులు, వివిధ వ్యాపార వర్గాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై కూడా పోరాటం చేయాలని పవన్ భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కోమాలో బాధితుడు.. 25 రోజుల తర్వాత BD25,000 పరిహారం..!!
- యూఏఈలో మెజారిటీ వయస్సు 18 సంవత్సరాలకు తగ్గింపు..!!
- సౌదీలో 116 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు..!!
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!







