న్యూస్‌వీక్ తాజా సర్వే ప్రకారం నెం.1 ఇండియన్ హార్ట్ హాస్పిటల్‌గా అపోలో
- September 28, 2021
హైదరాబాద్: గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఉపకరణాన్ని జాతీయ స్థాయిలో విడుదల చేస్తున్నట్లుగా అపోలో హాస్పిటల్స్ నేడు ప్రకటించింది. అపోలో ఎఐ-శక్తితో పనిచేసే కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ టూల్ వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులలో గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి మరియు వైద్య చికిత్స అందించడంలో ముందస్తు జోక్యం చేసుకోవడానికి సహాయపడుతుంది. కార్డియాక్ రిస్క్ స్కోరింగ్ ఉపకరణం ప్రాసెసింగ్ డేటా ద్వారా వేగంగా పనిచేసి రోగిలో కరోనరీ వ్యాధి సంభవించే అవకాశాన్ని అంచనా వేయడంలో ఖచ్చితత్వంతో వెల్లడిస్తుంది. ఈ ఉపకరణాన్ని ఉపయోగించి, గుండె జబ్బు ప్రమాదం పొంచివున్న వ్యక్తులకు ముందస్తుగా మరియు నివారణగా వైద్య సంరక్షణను చురుకుగా అందించేందుకు వైద్యులను సంసిద్దులను చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై భవిష్యత్తు ఒత్తిడిని తగ్గించి జీవితాలను మెరుగుపరుస్తుంది.

ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ మ్యాగజైన్ మరియు వెబ్‌సైట్ అయిన న్యూస్‌వీక్ తాజాగా విడుదల చేసిన అత్యుత్తమ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ 2022 ర్యాంకింగ్‌లో స్తానం సంపాదించడం తమకు గర్వకారణంగా ఉందని అపోలో హాస్పిటల్స్ ఈ సందర్భంగా ప్రకటించింది. అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్టాటిస్టా భాగస్వామ్యంతో ప్రపంచంలోని అత్యుత్తమ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ మరియు కార్డియాలజీ మరియు ఆంకాలజీల టాప్ హాస్పిటల్స్‌లో 250 ర్యాంకును మరియు పది స్పెషాలిటీలలో పీడియాట్రిక్స్‌లో టాప్ 150 ర్యాంకును అపోలో హాస్పిటల్స్ సాధించింది. చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో ఉన్న అపోలో హార్ట్ సెంటర్ ఉత్తమ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ 2022 - కార్డియాలజీ జాబితాలో 126 ర్యాంక్‌ను మరియు ఇదే జాబితాలో ఐదు భారతీయ అత్యుత్తమ ఆసుపత్రులలో నంబర్ 1 స్థానంలోనూ నిలిచింది.
అలాగే, అత్యుత్తమ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ 2022 - ఆంకాలజీలో, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ నుండి రెండు హాస్పిటల్స్ అపోలో క్యాన్సర్ సెంటర్‌ల జాబితాలో అపోలో స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్, చెన్నై మరియు అపోలో హాస్పిటల్స్, చెన్నైలు వరుసగా 228 మరియు 239 స్థానంలో నిలిచాయి. ఆంకాలజీ జాబితాలో ఉన్న కేవలం నాలుగు భారతీయ ఆసుపత్రులలో ఈ రెండు ఆసుపత్రులు కూడా ఉన్నాయి. పీడియాట్రిక్ స్పెషాలిటీలో, చెన్నై అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రపంచవ్యాప్తంగా 103 స్థానంలో ఉన్నది మరియు 2022 - పీడియాట్రిక్స్ ర్యాంకింగ్‌లో అత్యుత్తమ స్పెషలైజ్డ్ హాస్పిటల్స్‌లో భాగంగా కేవలం ఐదు భారతీయ ఆసుపత్రులలో ఒకటిగా ఉన్నది.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ, ‘‘దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రజల ఆరోగ్యంతో సంక్లిష్టంగా ముడిపడినటువంటి అంశం. అది జాతీయ ఆదాయంపై ప్రభావం చూపడం ద్వారా ఉత్పాదకతను కోల్పోతున్నది. ఎన్‌సిడి (నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్)లు స్థూల జాతీయోత్పత్తిలో 5% నుండి 10% వరకు ఆర్థిక భారం కలిగిస్తున్నాయని అంచనాలు సూచిస్తున్నప్పటికీ, జీవనశైలి వ్యాధుల యొక్క దీర్ఘకాలిక స్వభావం మరియు వాటి ప్రాబల్యం పెరుగుదల అంచనాతో వాటిని కనుక సకాలంలో పరిష్కరించకపోతే ఆర్థికంగా పెనుభారం కానున్నాయి. జీవనశైలి వ్యాధుల పెరుగుతున్న భారంలో, కార్డియో వాస్కులర్ వ్యాధులు (సివిడిలు) ముందు వరుసలో ఉన్నాయి. ఆసియా పసిఫిక్‌లో మరణానికి కార్డియోవాస్కులర్ వ్యాధి ప్రధాన కారణంగా ఉంటున్నది, మరియు మన జనాభా వయస్సు పెరిగే కొద్దీ ఇది మరింత తీవ్రమవుతున్నది. వాస్తవ వ్యత్యాసాన్ని నిర్ధారించడంలో ముందుగానే రోగ నిర్ధారణ చేయడంలో వైద్య సంరక్షులు ఇబ్బంది పడుతున్న సమస్య కూడా ఇదే.
‘‘వైద్యులు తమ రోగులకు గుండె జబ్బులు వచ్చే సంభావ్యతను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి ఇప్పటికే కొన్ని ఊహాజనిత సాధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వీటిలో ఎక్కువ భాగం పాశ్చాత్యదేశాల డేటా సెట్‌లపై ఆధారపడి ఉంటాయి మరియు అవి స్థానిక ప్రమాద వైవిధ్యాలను పరిగణనలోకి తీసుకోవు. వీటిని భారతీయ సందర్బం తీసుకుని వర్తింపచేసినప్పుడు రోగుల ఖచ్చితత్వాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. అపోలో ఎఐ - పవర్డ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ టూల్ దానిని మారుస్తుంది మరియు వైద్యులు గుండె జబ్బులను అంచనా వేయడానికి మరియు నివారించడానికి మంచి పరిజ్ఞానాన్ని మరియు మార్గాలను అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ ఉపకరణం అపోలో వైద్యులకు మాత్రమే అందుబాటులో ఉండేది, ఇప్పుడు ఈ ఎఐ సాధనాన్ని దేశంలోని వైద్యులందరికీ అంకితం చేయడం అనేది మాకు గర్వకారణంగా ఉన్నది.’’
న్యూస్‌వీక్ యొక్క గుర్తింపుపై డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ, ‘‘అపోలో హాస్పిటల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో అందించిన ప్రత్యేక ఆరోగ్య సంరక్షణకు ఈ ప్రపంచస్థాయి గుర్తింపు ప్రపంచంలోని అత్యుత్తమ ఆసుపత్రుల ఫలితాలతో సరిపోతుంది. అపోలో హాస్పిటల్స్, ప్రపంచంలోని అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులతో, క్లాస్ క్లినికల్ ఫలితాలను ఉత్తమంగా అందించడంలో భారతదేశానికి ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలను తీసుకురావడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.’’
అపోలో హాస్పిటల్స్‌లోని వైద్య బృందం దేశవ్యాప్తంగా 4,00,000 మంది వ్యక్తులకు సంబంధించిన పది సంవత్సరాల కంటే ఎక్కువ డేటాను సేకరించింది. అప్పుడు, వారు మైక్రోసాఫ్ట్ అజూర్‌ని ఉపయోగించేవారు, ఆ సున్నితమైన డేటాను మెషీన్ లెర్నింగ్ మోడళ్లకు మార్చి శిక్షణ ఇవ్వడానికి డేటా సైంటిస్టులు మరియు క్లినిషియన్లు ఉపయోగించగల ఆచరణీయ వాస్తవ అంతర్దృష్టులుగా మార్చారు. మాస్ట్రిచ్ట్ ప్రాంతంలో దీర్ఘకాలిక సమగ్ర ఆరోగ్య అధ్యయనం ద్వారా లభించిన మాస్ట్రిచ్ట్ స్టడీ మరియు నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిచ్ట్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్‌లోని హార్ట్ + వాస్కులర్ సెంటర్ నుండి సేకరించిన డేటాను ఉపయోగించి ఈ ఉపకరణం ధృవీకరించబడిరది.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ, ‘‘అనేక సంవత్సరాల పరిశోధన మరియు అభివృద్ధి మరియు అపోలో హాస్పిటల్స్ యొక్క సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం యొక్క ఫలాల ఫలితమే గుండె జబ్బులను అంచనా వేయడానికి మరియు నివారించడానికి రూపొందించిన ఎఐ సాధనం. అపోలో యొక్క ఎఐ - శక్తితో పనిచేసే కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ స్కోర్ అనే పరికరం భారతీయ జనాభాలో ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది, కాబట్టి వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులలో గుండె జబ్బుల ప్రమాదాన్ని బాగా అంచనా వేయగలుగుతారు. అపోలో హాస్పిటల్స్‌లో వైద్య బృందం ద్వారా సేకరించిన దేశవ్యాప్తంగా ఉన్న 4,00,000 మంది వ్యక్తులకు సంబంధించిన పది సంవత్సరాల అనానిమైజ్డ్ డేటా ఆధారంగా రూపొందించిన ఈ ఉపకరణం అల్గోరిథంలపై నిర్మించబడిరది.
‘‘మైక్రోసాఫ్ట్ అజూర్ ప్లాట్‌ఫాం ద్వారా ఫెడరేటెడ్ లెర్నింగ్ ఉపయోగించిన ఈ టూల్ అంతర్జాతీయంగా ధృవీకరించబడింది. అపోలో నెట్‌వర్క్‌కు చెందిన వైద్యులు ఎఐ- శక్తితో పనిచేసే ఈ సాధనాన్ని మూడు సంవత్సరాలుగా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి మరియు దేశవ్యాప్తంగా ప్రివెంటీవ్ కార్డియాక్ కేర్‌ను నడపడానికి ఉపయోగిస్తున్నారు. గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఎఐ సాధనాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, 2025 నాటికి సివిడిలతో సహా జీవనశైలి వ్యాధుల (ఎన్‌సిడి) నుండి అకాల మరణాల ప్రమాదాన్ని 25% వరకు తగ్గించాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యాన్ని సాధించడానికి మనం సహాయం చేయగలుగుతాము.’’
ఎఐ - ఆధారితంగా పనిచేసే ఈ ఉపకరణం భారతీయ జనాభా కోసం ప్రత్యేక అల్గోరిథంలను ఉపయోగించి మరింత ఖచ్చితమైన సివిడి రిస్క్ స్కోర్‌ను అందిస్తుంది మరియు ప్రామాణిక సంరక్షణ నియమాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్య పరీక్షలు మరియు కరోనరీ ఈవెంట్‌లపై పునరాలోచన డేటా యొక్క పెద్ద నమూనాపై అనువర్తిత ఎఐ మరియు క్లినికల్ నైపుణ్యం కలయికతో అభివృద్ధి చేయబడిన ఈ సాధనం తీసుకునే ఆహారం, పొగాకు మరియు ధూమపానంల యొక్క ప్రాధాన్యతలు మరియు శారీరక శ్రమ వంటి అన్ని రకాల జీవనశైలి లక్షణాలకు సంబంధించిన కారణాలను పరిగణనలోకి తీసుకుని రిస్క్ స్కోర్‌ను అందిస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి మరియు ఆందోళనలు రోగి శ్వాస రేటు మరియు రక్తపోటు తీరును ప్రతిబింబిస్తుంది. ప్రమాద తీవ్రతను, ఎక్కువ, మధ్యస్త మరియు తక్కువగా వర్గీకరించబడిరది. స్కోర్‌ను మెరుగుపరచడానికి సవరించగల రిస్క్ కంట్రిబ్యూటర్‌లపై అంతర్దృష్టులను కూడా ఈ ఉపకరణం అందిస్తుంది. జీవనశైలి మార్పులతో నిర్దిష్ట అంతర్దృష్టులతో వైద్యులు తమ రోగులకు మరింత సమగ్రమైన సలహాలను అందించడానికి ఇదీ వీలు కల్పిస్తుంది.
ఎఐ టూల్‌ను యాక్సెస్ చేయడం గురించి వివరాల కోసం, వైద్యులు తమ వివరాలను [email protected]కు పంపవచ్చు.
తాజా వార్తలు
- రూ.500 నోట్లు బంద్.. రూమర్స్ పై కేంద్ర ప్రభుత్వం వివరణ
- యూఏఈని కమ్మేసిన పొగమంచు..రెడ్ అలర్ట్ జారీ..!!
- రియాద్‌లో యెమెన్ సమావేశం.. స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఒమన్ ఆకాశంలో అద్భుతం.. క్వాడ్రాంటిడ్ ఉల్కాపాతం..!!
- కువైట్ లో నగదు స్మగ్లింగ్.. అడ్డుకున్న కస్టమ్స్..!!
- బహ్రెయిన్ రికార్డు..పోటెత్తిన ప్రయాణికులు..!!
- గాజాలో క్షీణించిన మానవతాపరిస్థితులు.. అరబ్ దేశాలు ఆందోళన..!!
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!







