దుబాయ్ ఎక్స్ పో-2020, హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్స్
- September 29, 2021
దుబాయ్: అక్టోబర్ 1 న ప్రారంభమయ్యే దుబాయ్ ఎక్స్ పో-2020 కోసం జనమంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఎక్స్ పో చూసేందుకు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు.దీంతో హాట్ కేకుల్లా టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. దుబాయ్ ఎక్స్ పో లో ప్రపంచంలోని 192 కంట్రీస్ కి సంబంధించిన విశేషాలు, ప్రపంచంలోని బెస్ట్ ఫుడ్స్ రుచులను అందుబాటులో పెట్టనున్నారు. దాదాపు 60 లైవ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ పో లలో ఇదొక్కటి.
మంత్లీ పాస్ ఒక్కరోజులో ఈ ఎక్స్ పో చూడటం సాధ్యం కాదు. ఆ రేంజ్ లో ప్రపంచ విశేషాలు ఇందులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎక్స్ పో ను తనివితీరా చూడాలనుకునే వారికోసం దుబాయ్ అధికారులు మొత్తం నెల రోజుల పాస్ తీసుకునే అవకాశం కల్పించారు. అదే విధంగా ఒక్క రోజుకి 95 దిర్హామ్ లు నిర్ణయించారు. ఎన్ని రోజులు కావాలనుకునే వారు అన్ని రోజులకు సరిపడ టిక్కెట్ తీసుకోవచ్చు. మొత్తం నెల రోజుల కోసం మంత్ పాస్, ఆరు నెలల పాస్ తీసుకునే అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. అక్టోబర్ 15 వరకు టిక్కెట్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
18 ఏళ్ల లోపు వారికి ఫ్రీ
ఈ ఎక్స్ పో 18 ఏళ్ల లోపు వారికి, హైయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కి, 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కి కూడా ఉచితం. ఇక అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎమిరేట్స్ ఫ్లైట్ లో దుబాయ్ వచ్చే వారికి ఫ్రీ గా ఒక్క పాస్ ఇవ్వనున్నారు. దుబాయ్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే ప్యాసింజర్స్ కు కూడా ఫ్రీ గా పాస్ ఇవ్వనున్నారు.
సింగిల్ టిక్కెట్ల ధరలు
సింగిల్ ఎంట్రీ-95 దిర్హామ్స్.
సిక్స్ మంత్స్ సీజన్ పాస్ -495 దిర్హామ్
మల్టీ డే పాస్ – 195 దిర్హామ్ ( 30 రోజుల పాటు ఎంట్రీ)
ఎక్స్ పో టిక్కెట్లను దుబాయ్ ఆన్ లైన్ టిక్కెట్ ఆఫీస్ ద్వారా, దుబాయ్ లోని మెట్రో స్టేషన్లు, ఇనాక్, సర్వీస్ సెంటర్లలో పొందవచ్చు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..