వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్ లైన్స్ సౌదియా

- September 30, 2021 , by Maagulf
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్ లైన్స్ సౌదియా

సౌదీ అరేబియా: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్‌లైన్స్‌గా సౌదియా ప్రశంసలు అందుకుంటోంది. ఈ మేరకు 2021 సంవత్సరానికిగానే వేగంగా అభివృద్ధి చెందుతున్నఎయిర్‌లైన్స్ కేటగిరీలో స్కైట్రాక్స్ అవార్డు దక్కించుకుంది సౌదియా. 2017 నుంచి సౌదియా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. 82వ ర్యాంకు నుంచి 51వ స్థానానికి ఎదిగింది. 40 శాతం వృద్ధి సాధించింది. ఈ ఏడాది సౌదియా 55 శాతం వృద్ధి సాధించి 26వ స్థానాన్ని స్కైట్రాక్స్ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో దక్కించుకోవడం జరిగింది. కరోనా పాండమిక్ సమయంలో సౌదియా చేపట్టిన ప్రత్యేక భద్రతా చర్యలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com