భారత్ కరోనా అప్డేట్
- September 30, 2021
న్యూ ఢిల్లీ: భారత్‌లో రోజు వారి కరోనా కేసులు సంఖ్య భారీగా తగ్గి.. 20 వేలకు దిగువకు పడిపోయిన ఊరట కలిగిస్తున్న సమయంలో.. మరోసారి భారీగా పెరిగాయి కోవిడ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. మరోసారి 20 వేల మార్క్‌ను క్రాస్ చేశాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,529 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 311 మంది కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. ఇక, ఇదే సమయంలో 28,718 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,37,39,980కు చేరుకోగా.. రికవరీ కేసులు 3,30,14,898 పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4,48,062కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 65,34,306 వ్యాక్సిన్లు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 88,34,70,578 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







