పేరెంట్స్ కు ఊరట. నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేసిన ఇండియన్ స్కూల్స్

- October 01, 2021 , by Maagulf
పేరెంట్స్ కు ఊరట. నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేసిన ఇండియన్ స్కూల్స్

మస్కట్: ఇండియన్ స్కూల్స్ పేరెంట్స్ కు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కారణంగా చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగాలు లేక పనులు పోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు ఏడాదిన్నరగా స్కూల్స్ మూసే ఉన్నాయి. ఈ వారంలో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఐతే పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఇండియన్ స్కూల్స్ నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేయాలని నిర్ణయించాయి. “కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ తల్లితండ్రుల విజ్ఞప్తి మేరకు నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేయాలని నిర్ణయించాం” అని ఒమన్ లోని ఇండియన్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ శివకుమార్ మాణికం చెప్పారు. అదే విధంగా క్వార్టర్లీ చెల్లించాల్సిన ఫీజును నెల నెల చెల్లించే అవకాశం కూడా కల్పించింది. ఇండియన్ స్కూల్స్ నిర్ణయంపై పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com