సౌదీలో మరిన్ని కొత్త పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను ఏర్పాటు చేస్తామన్న సౌదీ అటార్నీ జనరల్
- October 01, 2021
సౌదీ: దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించిన విచారణ వేగవంతం చేయాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా మరిన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను త్వరలోనే ప్రారంభిస్తామని అటార్నీ జనరల్ షేక్ సౌద్ అల్ ముజాబ్ చెప్పారు. గురువారం యెన్బు లోని కింగ్ డమ్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో అటార్నీ జనరల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరిన్ని కొత్త పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. మానవ అక్రమ రవాణా, సైబర్ క్రైమ్స్, పబ్లిక్ ఎథిక్స్, పర్యావరణ అంశాలకు సంబంధించిన సమస్యలను ఈ కొత్త ప్రాసిక్యూషన్ లో ప్రజలు అప్పీల్ చేసుకోవచ్చు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విధానాన్ని ప్రజలకు మరింత చేరువ చేసుందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అటార్నీ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









