పేరెంట్స్ కు ఊరట. నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేసిన ఇండియన్ స్కూల్స్
- October 01, 2021
మస్కట్: ఇండియన్ స్కూల్స్ పేరెంట్స్ కు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కారణంగా చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగాలు లేక పనులు పోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. దాదాపు ఏడాదిన్నరగా స్కూల్స్ మూసే ఉన్నాయి. ఈ వారంలో స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. ఐతే పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఇండియన్ స్కూల్స్ నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేయాలని నిర్ణయించాయి. “కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ తల్లితండ్రుల విజ్ఞప్తి మేరకు నాన్ రిఫండబుల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫీజు మాఫీ చేయాలని నిర్ణయించాం” అని ఒమన్ లోని ఇండియన్ స్కూల్స్ చైర్మన్ డాక్టర్ శివకుమార్ మాణికం చెప్పారు. అదే విధంగా క్వార్టర్లీ చెల్లించాల్సిన ఫీజును నెల నెల చెల్లించే అవకాశం కూడా కల్పించింది. ఇండియన్ స్కూల్స్ నిర్ణయంపై పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







