లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ యూసుఫ్ అలీకి ఒమన్ లాంగ్ టర్మ్ రెసిడెన్స్ వీసా
- October 01, 2021
ఒమాన్: లులు గ్రూప్ చైర్మన్, అబుదాబీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ చైర్మన్ ఎం.ఎ యూసుఫ్ అలీకి ఒమన్ ప్రభుత్వం లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసా ఇచ్చింది. ఒమన్ వాణిజ్య శాఖ మంత్రి ఖ్వాస్ బిన్ మహ్మద్ అల్ యూసుఫ్ ఆయనకు ఈ వీసాను అందజేశారు. ఒమన్ లో వ్యాపారం చేస్తూ ఉద్యోగాలు కల్పించే వారికి ప్రాధాన్యం ఇస్తామని ఒమన్ వాణిజ్య శాఖ సలహాదారు ఖలీద్ బిన్ సయ్యద్ తెలిపారు. లులు గ్రూప్ చైర్మన్ కు లాంగ్ టర్మ్ రెసిడెన్సీ వీసా ఇవ్వటం ద్వారా దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అటు తనకు ఈ గౌరవం దక్కటం సంతోషంగా ఉందని..ఒమన్ రాజు సుల్తాన్ హయిథమ్ బిన్ తారిక్ అల్ కు యూసుఫ్ అలీ థ్యాంక్స్ చెప్పారు. లులు గ్రూప్ కు పలు దేశాల్లో వందల సూపర్ మార్కెట్ల వ్యాపారం ఉంది. ఒమన్ లోనూ 27 స్టోర్స్ ఉన్నాయి.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







