విదేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇబ్బందేమీ లేదు. యాప్ లో వివరాలు చేస్తే చాలన్న అబుదాబి
- October 01, 2021
యూఏఈ: విదేశాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అబుదాబి వాసులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాల్లో తీసుకున్న టీకా వివరాలను యాప్ లో అప్ లోడ్ చేస్తే చాలని తెలిపింది. ఐతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అఫ్రూవ్ చేసిన టీకానే వేసుకొని ఉండాలని కోరింది. టీకా తీసుకున్న వ్యక్తి పేరు, వివరాలను నమోదు చేయాలని తెలిపింది. ఏ దేశంలో వ్యాక్సిన్ తీసుకున్నది కూడా వివరాల్లో తెలిపాలని అబుదాబి పబ్లిక్ హెల్త్ సెంటర్ తెలిపింది. అక్టోబర్ 1, 2020 తర్వాత టీకా తీసుకున్న వారికి అనుమతి ఉంటుందని తెలిపింది. యాప్ లో వివరాలు నమోదు చేసిన వారు అబుదాబి వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్ కు ముందుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ టీకా తీసుకున్నారా లేదా అన్నది ధృవీకరించింది వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తారు. విదేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న అబుదాబి వాసులకు ఇబ్బంది ఉండొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









