రొమాన్స్ కి ఒప్పుకోలేదని విద్యార్థిని గొంతుకోసిన యువకుడు
- October 01, 2021
కేరళ: కాలేజీలో తన తోటి విద్యార్దినిని ప్రేమ పేరుతో, లైంగికంగా వేధిస్తూ తనతో రొమాన్స్ చేయమని కోరుతున్నాడొక విద్యార్ధి. అందుకు ఆమె నిరాకరించటంతో పరీక్ష రాయటానికి వచ్చిన విద్యార్ధినిని కిరాతకంగా హత్యచేశాడు. కేరళలోని కొట్టాయం జిల్లా పాలా ఏరియాలోని సెయింట్ థామస్ కాలేజీలో శుక్రవారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.
కొట్టాయం జిల్లాలోని వైకోమ్ లోని తొలయోల పరంబుకు చెందిన నితినా మోల్(22) సెయింట్ థామస్ కాలేజీలో చదువుతోంది. అదే కాలేజీలో కొట్టాయంజిల్లా, వల్లచిరకు చెందిన అభిషేక్(22) కూడా చదువుతున్నాడు. ఈక్రమంలో అభిషేక్, నితినా వెంటపడి వేధించటం మొదలెట్టాడు. తనతో ఫ్రెండ్ షిప్ చేయాలని.. తనతో రొమాన్స్ చేయాలని వేధించసాగాడు. అయితే అభిషేక్ ప్రతిపాదనలను నితినా తిరస్కరించింది.
అతడి మాటలను పట్టించుకోకుండా తనదారిన తాను కాలేజీకి వచ్చి వెళుతోంది. దీంతో అభిషేక్ నితినాపై కోపం పెంచుకున్నాడు. రాన్రాను అది పగలాగా మారింది. నితినాపై పగ పెంచుకున్న అభిషేక్ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో శుక్రవారం కాలేజీలో పరీక్షలు రాసేందుకు ఇద్దరూ వచ్చారు. శుక్రవారం ఉదయం పరీక్షలు ప్రారంభమయ్యాయి.
పగతో రగిలిపోతున్న అభిషేక్ పరీక్ష పూర్తిగా రాయకుండా మధ్యలోనే బయటకు వచ్చేశాడు. క్యాంపస్‌లోనే నితినా ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురు చూడసాగాడు. పరీక్ష రాసి బయటకు వచ్చిన నితినా పై పేపర్ కట్టర్ సాయంతో గొంతుకోసాడు. తీవ్ర రక్త స్రావమైన నితినాను కాలేజీ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నితినా ప్రాణాలు విడిచింది.
కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసుసులు కేసు నమోదు చేసుకుని అభిషేక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.కాగా… నితినాను గొంతుకోసిన తర్వాత అభిషేక్ అక్కడే కూర్చుండి పోయాడు. వీరిద్దరూ గొడవపడుతున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది ఒకరు చూశామని తెలిపారు. తాను నితినాను హత్యచేయాలని అనుకోలేదని అరెస్టైన తర్వాత అభిషేక్ వ్యాఖ్యానించాడు. కుమారుడి ప్రేమ వ్యవహారం తనకు తెలుసని..ముందు చదువుమీద ధ్యాస పెట్టమని చెప్పానని అభిషేక్ తండ్రి బైజు విలేకరులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







