20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సప్
- October 02, 2021
భారత్: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ గత ఆగస్టు నెలలో సుమారు 20 లక్షల ఇండియన్ అకౌంట్లను బ్యాన్ చేసింది. కొత్త ఐటీ రూల్స్ 2021 ప్రకారం ఆయా అకౌంట్లను బ్యాన్ చేసినట్టు సంస్థ వెల్లడించింది. వాట్సప్ చాట్ ను అసాంఘీక పనుల కోసం, ఇతరులకు హాని కలిగించే కంటెంట్ ను పంపించడం లాంటి ఇష్యూలను దృష్టిలో పెట్టుకొని వాట్సప్ ఆ అకౌంట్లను బ్యాన్ చేసింది.
గత ఆగస్టు నెలలో 20,70,000 అకౌంట్లను బ్యాన్ చేసింది. అందులో 222 అకౌంట్ల యూజర్లు తిరిగి అప్పీల్ చేసుకున్నారు. ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ నుంచి కూడా కొన్ని అకౌంట్ల బ్యాన్ పై అప్పీల్ వచ్చినట్టు సంస్థ వెల్లడించింది.
యూజర్ల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా.. వాట్సప్ లో ఉన్న ఓ టూల్ ఆధారంగా.. హానికరమైన బిహేవియర్ ఉన్న అకౌంట్లను బ్యాన్ చేసింది. అకౌంట్ రిజిస్ట్రేషన్ సమయంలో, మెసేజ్ ల ద్వారా, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ద్వారా ఆయా అకౌంట్లను టూల్ గుర్తిస్తుంది. నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అనేది యూజర్ రిపోర్ట్ చేసి బ్లాక్ చేసినప్పుడు సంబంధిత అకౌంట్ ను టూల్ అనలైజ్ చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా గత జులైలో వాట్సప్ బ్యాన్ చేసిన అకౌంట్లలో 25 శాతం ఇండియాకు చెందిన అకౌంట్లే. ప్రతి నెల ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 లక్షల అకౌంట్లు బ్యాన్ అయితే.. అందులో సుమారు 20 లక్షల అకౌంట్లు ఇండియా నుంచే ఉంటాయని వాట్సప్ స్పష్టం చేసింది.
జూన్ 16 నుంచి జులై 31 వరకు వాట్సప్ 3,027,000 అకౌంట్లను బ్యాన్ చేయగా.. అందులో 2,011,000 అకౌంట్లను మే 15 నుంచి జూన్ 15 మధ్యలో బ్యాన్ చేసింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







