ప్రపంచవ్యాప్తంగా నిలిచిన వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా సేవలు
- October 04, 2021
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. 20 నిమిషాలుగా పనిచేయని సేవలు.. ఫేస్బుక్ కు చెందిన సోషల్ మీడియా అప్లికేషన్స్ అయిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో యూజర్లు ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫీడ్ రీఫ్రెష్ కూడా కాకపోవడంతో యూజర్ల నుంచి అసహనం వ్యక్తమైంది. అయితే దీనిపై మాతృ సంస్థ అయిన ఫేస్బుక్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఒక్క సారిగా సర్వీసులు నిలిచిపోవడంతో యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు.
సోషల్ మీడియా నేడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైన విషయం తెలిసిందే. అయితే ఒక్కసారిగా సేవలన్నీ నిలిచిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఫోన్ సమస్యా.. ? లేకా నెట్వర్క్ సమస్యా.. ? అనేది తెలియక గందరగోళానికి గురయ్యారు. అనేక మంది యూజర్లు ఆయా యాప్ ను అన్ ఇన్స్టాల్ చేసుకుని మళ్లీ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వారు వెల్లడించారు. ఇక ఫేస్బుక్ సేవలపై ట్రోల్స్ కూడా అప్పుడే మొదలైయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









