కొత్త ట్రావెల్ పాలసీకి అనుగుణంగా హోటల్స్ ప్యాకేజీలు
- October 05, 2021
ఖతార్: ఖతార్ ప్రభుత్వం కొత్త ట్రావెల్ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి ఇది అందుబాటులోకి రానుంది. ఈ పాలసీ ప్రకారం రెడ్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే వాళ్లు కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. వీరికి రెండు రోజుల హోటల్ క్వారంటైన్ ఉంటుంది. గ్రీన్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే వాళ్లకు వ్యాక్సిన్ తీసుకోకపోయిన అనుమతి ఉంది. కానీ 7 డేస్ హోటల్ క్వారంటైన్ లో ఉండాలి. ఐతే అందుకు అనుగుణంగా హోటల్స్ ప్యాకేజీలను ప్రకటించాయి. వీటిని ఖతార్ వచ్చే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. డిస్కవర్ ఖతార్ వెబ్ సైట్ ద్వారా ప్రయాణికులు హోటల్స్ ను బుక్ చేసుకోవచ్చు. రెండు రోజుల క్వారంటైన్ కు, ఏడు రోజుల క్వారంటైన్ కు ఆఫర్స్ తో చాలా హోటల్స్ ప్యాకేజీలు ప్రకటించాయి. వీటిని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. బుధవారం నుంచి ఈ ఆఫర్స్ అందుబాటులోకి రానున్నాయి. రెడ్ లిస్ట్ లో ఉన్న కంట్రీస్ నుంచి వచ్చే 11 ఏళ్ల లోపు పిల్లలు వ్యాక్సిన్ తీసుకోకపోయిన సరే వాళ్లకు అనుమతి ఇచ్చారు. ఐతే రెండు రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







