సౌదీ అఫ్రూవ్ చేయని వ్యాక్సిన్ వేసుకుంటే 2 రోజలు క్వారంటైన్
- October 05, 2021
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొత్త రూల్స్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే విదేశీ ప్రయాణికులకు కచ్చితంగా 2 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఐతే సౌదీ ప్రభుత్వం అఫ్రూవ్ చేసిన ఫైజర్ బయోటెక్, ఆక్స్ ఫోర్డ్, అస్ట్రా జెనికా, మోడర్న్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రం కరోనా టెస్టులు మాత్రమే చేయనుంది. ప్రభుత్వం అప్రూవ్ చేయని వ్యాక్సిన్ వేసుకున్న వారికి రెండు రోజుల పాటు క్వారంటైన్ నిబంధన తప్పనిసరి గా అమలు చేయనుంది. ఆ తర్వాత వారికి కరోనా టెస్టు చేస్తారు. ఐతే 8 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం రెండు రోజుల క్వారంటైన్ నిబంధన మాత్రమే విధించారు. వారికి ఎలాంటి మెడికల్ టెస్టులు ఉండవని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు సౌదీ కి వచ్చిన వారికి 5 రోజుల క్వారంటైన్ నిబంధన ఉండేది. ఆ నిబంధనను మార్చేసి రెండు రోజుల క్వారంటైన్ రూల్ ను తెచ్చారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







