ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ ఆరు రోజులు సెలవు
- October 07, 2021
యూఏఈ: దుబాయ్ ఎక్స్ పో 2020 చూడాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఆరు రోజుల పెయిడ్ లీవ్స్ ను మంజూరు చేసింది. యూఏఈ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. యూఏఈ వైస్ ప్రెసెడింట్, యూఏఈ ప్రధాన మంత్రి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఫెడరల్ ప్రభుత్వంలోని ఉద్యోగులంతా వారి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ ఎక్స్ పో ను చూడవచ్చని ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ ప్రభుత్వం కూడా తమ దేశంలోని ఉద్యోగులకు 6 రోజుల పాటు పెయిడ్ లీవ్స్ మంజూరు చేయటంతో అదే తరహాలో యూఏఈ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. యూఏఈ అధ్యక్షుడి మంత్రిత్వ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఇప్పటికే 8 రోజుల పెయిడ్ లీవ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక దుబాయ్ ఎక్స్ పో ఈ నెల 1 ప్రారంభమైంది. వచ్చే ఏడాది 31 వరకు ఇది కొనసాగనుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







