దానిమ్మతో ఆరోగ్య ప్రయోజనాలు..

- October 08, 2021 , by Maagulf
దానిమ్మతో ఆరోగ్య ప్రయోజనాలు..

సీజన్ తో సంబంధం లేకుండా మనకి అందుబాటులో ఉండే పండ్లలో దానిమ్మ ఒకటి.. చూడడానికి ఎర్రగా చాలా అందంగా కనిపించే ఈ పండు వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

  • గుండె సంబంధిత వ్యాదులకి చెక్ పెట్టడంలో దానిమ్మ చాలా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది.
  • అధికరక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడం మంచిది. ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది.
  • దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ దీనికి ఉంది. గర్భిణీలు కచ్చితంగా దానిమ్మను ఆహారంలో ఓ భాగం చేసుకోవాలి. దీనివల్ల గర్భస్త శిశువు బాగా ఎదుగుతుంది.
  • ఆరోగ్యానికి కాదు.. అందానికి కూడా ఈ పండు చాలా ఉపయోగపడుతుంది. దానిమ్మ రసంలో ఒక స్పూన్‌ పంచదార, ఒక స్పూన్‌ తేనె వేసిన ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com