'మా'కు సీవీఎల్ రాజీనామా..

- October 09, 2021 , by Maagulf
\'మా\'కు సీవీఎల్ రాజీనామా..

హైదరాబాద్: మా ఎన్నికలు రసవత్తంగా మారుతున్నాయి. ఎలక్షన్‌కు ఒక్కరోజే గడువు ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్ధులు అరోపణలు, ప్రత్యారోపణలతో ఎలక్షన్ వేడి మరింత పెరిగింది. అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న మంచువిష్ణు, ప్రకాశ్ రాజుల చుట్టూ తిరుగుతోంది. మా అధ్యక్ష పోటీ నుంచి వైదొలగిన సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహరావు... మాకు రాజీనామ చేశారు. ముందుగా సీవీఎల్ నరసింహారావు కూడా మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌లతో పాటు అధ్యక్ష పోరులో నిలబడ్డారు. కానీ పలు కారణాల వల్ల ఆయన మా ఎన్నికల నుండి తప్పుకున్నారు. అప్పటి నుండి మా ఎన్నికలపై పలు కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన రాజీనామా గురించి మాలో చర్చ మొదలైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com