బూస్టర్ డోస్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

- October 10, 2021 , by Maagulf
బూస్టర్ డోస్ కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

కువైట్: బూస్టర్ డోస్ ప్రక్రియను కువైట్ ప్రభుత్వం ప్రారంభించింది. కరోనా వ్యాక్సిన్ రెండు డోస్ లు తీసుకున్నప్పటికీ కొంతమందికి మళ్లీ పాజిటివ్ వస్తోంది. దీంతో బూస్టర్ డోస్ కూడా ఇవ్వాలన్న హెల్త్ ఎక్స్ ఫర్ట్స్ సూచనతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ముందుగా 60 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత హెల్త్ వర్కర్స్, ఇమ్యూనిటీ తక్కువ గా ఉన్న అన్ని ఏజ్ గ్రూప్ ల వారికి బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్లు హెల్త్ మినిస్టర్ అబ్దుల్లా అల్ సనద్ తెలిపారు. రెండో డోస్ తీసుకున్న వారు బూస్టర్ డోస్ తీసుకోవటానికి మధ్యలో 6 నెలల గ్యాప్ ఉండాలని  ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ ను https:// cov19vaccine.moh.gov.kw/ SPCMS/CVD_19_ Vaccine_Booster_ Registration.aspx......వెబ్ సైట్ లో చేసుకోవచ్చన్నాారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com