ఏపీలో విద్యుత్ సంక్షోభం.. ప్రభుత్వం కీలక సూచనలు..

- October 10, 2021 , by Maagulf
ఏపీలో విద్యుత్ సంక్షోభం.. ప్రభుత్వం కీలక సూచనలు..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విద్యుత్ సంక్షోభం అందరినీ కలవరపెడుతోంది. బొగ్గు, గ్యాస్ నిల్వలు తక్కువవుతుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఇది. ఏపీ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. సమస్యను పరిష్కరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ (Nagulapalli Srikanth) విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరాల మధ్య అంతరం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మూడు రోజులుగా రద్దీ సమయాల్లో.కొన్ని ప్రాంతాల్లో కోతలు అమలువుతున్నాయని (Power cut), సాయత్రం 06 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీలు బంద్ (Switch of acs) చేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు. సాయంత్రం సమయంలో.. అధిక ధరపై విద్యుత్ కొనుగోలుకయ్యే ఖర్చును ఆదా చేసుకోవడానికి భవిష్యత్ లో సర్దుబాటు ఛార్జీలు పడకుండా ఉండేందుకు ఇలా చేయాలని తాము ప్రజలను కోరుతున్నామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే.. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 20 శాతం పెరిగిందని, కోవిడ్ కు ముందు అక్టోబర్ రోజుకు 160 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే.. ఇప్పుడు 195 మిలియన్ యూనిట్లు అవసరం అవుతోందన్నారు. బొగ్గు కొరత కారణంగా.థర్మల్ ప్లాంట్ లలో 40 మిలియన్ మేర ఉత్పత్తి తగ్గిందని, పవన విద్యుత్ రెండు, మూడు మిలియన్ యూనిట్లకు మించి రావడం లేదన్నారు.

ప్రస్తుతం ఏపీలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి, రెండు రోజులకు సరిపడా బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని, సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళితే.శుక్రవారం నుంచి అయిదు ర్యాక్ ల బొగ్గు అందుబాటులోకి వచ్చిందన్నారు. డిమాండ్ పెరగడంతో.. నెల నుంచి బహిరంగ మార్కెట్ లో విద్యుత్ రేట్లు భారీగా పెరిగాయన్నారు. డబ్బు పెట్టినా విద్యుత్ దొరకడం లేదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎక్కువ తక్కువ ధరకు దొరికితే.అక్కడే కొంటామని వెల్లడించారు.

బొగ్గు కొరతతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటి రెండు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని. విద్యుత్ విషయంలో విభజన నాటికి ఏపీ మిగుల్లో ఉంటే.. తెలంగాణ లోటులో ఉందని.గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు విద్యుత్ విషయంలో సీన్ రివర్స్ అయిందని. ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసినట్టే.. విద్యుత్ రంగాన్ని కుదేలు చేశారని వైసీపీపై మండిపడ్డారు. చైనాతో పోలికలు దేనికి.. పక్కనున్న తెలంగాణ పరిస్థితేంటీ..? 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తోన్నా.. తెలంగాణలో విద్యుత్ మిగులు ఉందనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని వైసీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ విషయం లో తెలంగాణ బాగా పనిచేస్తుందన్నారు. సీఎం జగన్ కు అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని. సీఎం నోటి వెంట అర్ధ సత్యాలు.. అవాస్తవాలు పలికిస్తోంది అధికారులేనని ఫైర్‌ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com