రష్యాలో విమానం కూలి 16 మంది మృతి
- October 10, 2021
రష్యా: విమాన ప్రమాదంలో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో జరిగింది. ఎల్ -410 టర్బోలెట్ విమానం రష్యాలోని టాటర్‌స్థాన్‌లో ఇవాళ కుప్పకూలిపోయింది. ప్రమాదసమయంలో విమానంలో 23 మంది ప్రయాణికులు ఉండగా.. ఉదయం 9.11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.విమాన ప్రమాదంలో 16 మంది మరణించినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ ఘటనలో మరో ఆరుగురు వ్యక్తులను కాపాడారు.. ఇక, రష్యా విడుదల చేసిన ప్రమాదానికి సంబంధించిన చిత్రాల ప్రకారం.. విమానం తీవ్రంగా దెబ్బతింది, సగానికి విరిగిపోయింది.ప్రాణాలతో బయటపడిన ఆరుగురు ఆసుపత్రిలో ఉన్నారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.. ఆ విమానం వాలంటరీ సొసైటీ ఫర్ అసిస్టెన్స్ ఫర్ ఆర్మీ, ఏవియేషన్ మరియు నేవీ ఆఫ్ రష్యాకు చెందినది, ఇది తనను తాను స్పోర్ట్స్ మరియు డిఫెన్స్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించింది.
తాజా వార్తలు
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!







