రష్యాలో విమానం కూలి 16 మంది మృతి
- October 10, 2021రష్యా: విమాన ప్రమాదంలో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన రష్యాలో జరిగింది. ఎల్ -410 టర్బోలెట్ విమానం రష్యాలోని టాటర్‌స్థాన్‌లో ఇవాళ కుప్పకూలిపోయింది. ప్రమాదసమయంలో విమానంలో 23 మంది ప్రయాణికులు ఉండగా.. ఉదయం 9.11 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.విమాన ప్రమాదంలో 16 మంది మరణించినట్లు అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ ఘటనలో మరో ఆరుగురు వ్యక్తులను కాపాడారు.. ఇక, రష్యా విడుదల చేసిన ప్రమాదానికి సంబంధించిన చిత్రాల ప్రకారం.. విమానం తీవ్రంగా దెబ్బతింది, సగానికి విరిగిపోయింది.ప్రాణాలతో బయటపడిన ఆరుగురు ఆసుపత్రిలో ఉన్నారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.. ఆ విమానం వాలంటరీ సొసైటీ ఫర్ అసిస్టెన్స్ ఫర్ ఆర్మీ, ఏవియేషన్ మరియు నేవీ ఆఫ్ రష్యాకు చెందినది, ఇది తనను తాను స్పోర్ట్స్ మరియు డిఫెన్స్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు