'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు
- October 10, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు. దాంతో ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో వీరి మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే ఇంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికలో మంచు విష్ణు విజయం సాధించాడు. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై ఎన్ని ఓట్ల తేడాతో విజయం సాధించారో కూడా చెప్పనున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







