'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపు
- October 10, 2021మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు. దాంతో ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో వీరి మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే ఇంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికలో మంచు విష్ణు విజయం సాధించాడు. ఈ విషయాన్ని కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై ఎన్ని ఓట్ల తేడాతో విజయం సాధించారో కూడా చెప్పనున్నారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు