విమానం నడిపి చరిత్ర సృష్టించిన బ్రూనై మహిళలు
- March 18, 2016
అక్కడ మహిళలు ఏం చేయాలన్న అనేక కట్టుబాట్లు ఉన్నాయి. అలాంటి దేశంలో మహిళలకు సరికొత్త చరిత్ర సృష్టించారు. బ్రూనై దేశానికి చెందిన ముస్లిం మహిళలు ఏకంగా విమానం నడిపి చరిత్ర సృష్టించారు. ఫిబ్రవరి 23వ తేదీన బ్రూనై నుంచి సౌదీ అరేబియాలోని జెద్దా వరకు 'ది రాయల్ బ్రూనై ఎయిర్ లైన్స్ కు చెందిన బి1081 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాన్ని వారు నడిపి దేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు. ఈ విమానంలో పురుషులెవరూ లేరు. మహిళా పైలెట్లతో పాటు మొత్తం క్రూ సిబ్బంది కూడా మహిళలే కావడం విశేషం. అది కూడా బ్రూనై జాతీయ దినోత్సవం రోజున ఆ మహిళామణులు విమానం నడపి తాము దేంట్లోనూ తక్కువ కాదని నిరూపించారు. 1984, ఫిబ్రవరి 23వ తేదీన బ్రిటన్ నుంచి బ్రూనై స్వాతంత్ర దేశంగా అవతరించిన సంగతి తెలిసిందే.
పైలెట్ ఉద్యోగాల్లో ముఖ్యంగా పురుషులే అధికంగా ఉంటారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ ఉద్యోగం పురుషాధిక్యంతో కూడినది. అలాంటిది ఈ వృత్తిలో మహిళలు ప్రవేశించడం అదీ కూడా బ్రూనై మహిళలు చేరడం గ్రేట్ అచీవ్ మెంట్ అని షరిఫా జరీనా సురైని ది బ్రూనై టైమ్స్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కెప్టెన్ షరిఫా జరీనా సురైని పైలెట్ వృత్తిలో ప్రవేశించి దక్షిణాసియాలోనే మొదటి కెప్టెన్ గా రికార్డు సృష్టించింది.మహిళలపై కఠిన చట్టాలు ఉన్న దేశంలో మహిళలే విమానం నడపడం పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ అరేబియా దేశంలో కూడా పురుషులకు పోటీగా మహిళలు పైలెట్లుగా ఎదిగేందుకు ఈ ఘటన దోహదపడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







