రెండో రోజు అంతర్జాతీయ విమానాల పండగ

- March 18, 2016 , by Maagulf
రెండో రోజు అంతర్జాతీయ విమానాల పండగ

హైదరాబాద్‌లో రెండో రోజు అంతర్జాతీయ విమానాల పండగ కనువిందు చేసింది. గురువారం జరిగిన విమానాల ప్రదర్శనలో నాలుగు ఏరోబొటిక్ విమానాలు సందర్శకులను హుషారెత్తించాయ. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం వీక్షకులను ఆకట్టుకుంది. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో నిర్వహించిన వైమానిక విన్యాసాలు సందర్శకులను అబ్బుర పరచాయి. నగరంలో ఐదవ సారి జరుగుతున్న విమానాల పండగలో బ్రిటన్‌కు చెందిన విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
బ్రిటన్‌కు చెందిన మార్క్ జెఫ్రీస్ బృందం జరిపిన విన్యాసాలు వీక్షకులను కవ్వించి, నవ్వించి ఆనందాశ్చర్యంలో ముంచెత్తాయి. విమానాలు 90 డిగ్రీల కోణంలో నిటారుగా గగనతలంలో పల్టీలు కొడుతూ.. అతి వేగంగా కిందకు దిగుతూ.. భూమికి తాకుతుందా అనిపించే విధంగా పైకి తేలిపోతున్న తీరు సందర్శకులను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. కాగా గురువారం 330 ఎస్‌సి ఎయిర్‌క్రాఫ్ట్‌ల విన్యాసాల్లో నలుగురు పైలెట్లు మార్క్‌జెఫ్రీస్, టామ్ కాస్సాల్స్, కెస్ బర్కట్, స్తీవ్ కార్వర్, మైఖేల్ జికిన్, గ్లోబల్ స్టార్స్ వీరం ఎరోబొటిక్ టీమ్‌లో ఉన్నారు. ఫార్మెషన్స్ సోలోతో 10 నిమిషాలు ఆకాశంలో విన్యాసాలు సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తాయి. ఈ విన్యాసాలు మరో మూడు రోజులుంటాయని నిర్వాహకులు తెలిపారు. బోయింగ్ 777 ఎయిర్ ఇండియా, డార్నియర్ హెచ్‌ఎఐ, టాక్-003 (త్రష్ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ) ఎంఐ-172 పవాన్ హంస్, ఏ 350 ఖతర్ ఎయిర్‌వేస్, ఏ0330-300 ఆసియా, 500, 650 లెగస్సీ, ఫెనామ్ 200 (బిజెనెస్ జెట్), బోయింగ్ 787, 380 ఎమిరేట్స్ వంటి విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఏవియేషన్ ఇండియా-2016 మొదటి రోజు సందర్శకులు తక్కువ శాతం హాజరుకాగా గురువారం సందర్శకుల తాకిడి పెరిగింది. సందర్శకులను ఎమిరేట్స్, ఎతిహద్ విమానాలను ఎక్కి చూడనిచ్చేందుకు అనుమతివ్వడంతో సందర్శకులు భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. విమానమెక్కిన డిజిపి అనురాగ్ శర్మ బేగంపేట విమానాశ్రయానికి తెలంగాణ రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మ కుటుంబ సభ్యులతో వచ్చారు. ఎమిరేట్స్ విమానం ఎక్కి తిలకించారు. దాదాపు పది నిమిషాల పాటు విమానంలో గడిపారు. సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా స్టాళ్లను చూసి ఆనందించారు. అదేవిధంగా విమానాశ్రయంలో పోలీసు బందోబస్తును పర్యవేక్షించినట్టు తెలిసింది. ** అంతర్జాతీయ విమానాల ప్రదర్శనలో విన్యాసాలు చేస్తున్న నాలుగు ఏరోబొటిక్ విమానాలు. **2020 నాటికి భారతీయ విమాన ప్రయాణికులు 370 మిలియన్లుకెపిఎంజి - ఫిక్కీ నివేదిక భారత్‌లో 2020 నాటికి 370 మిలియన్ల ప్రజలు విమానాల్లో ప్రయాణిస్తారని ఫిక్కీ, కెపిఎంజి ఇండియా ఏవియేషన్ రిపోర్టు 2016లో వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర పౌర విమానయానశాఖ గురువారం ఇక్కడ ఏవియేషన్ సదస్సులో విడుదల చేసింది. గత ఏడాది 81 మిలియన్ల ట్రిప్పులతో భారత్ దేశీయ ఏవియేషన్ మార్కెట్ సైజు 20.3 శాతం పెరిగింది. భవిష్యత్తులో ఎయిర్ క్రాఫ్ట్ టర్బైన్ ఇంధనం ధరలు తగ్గుదల, టూరిజం పెరుగుదల, వీసా సంస్కరణల వల్ల విమాన ప్రయాణ చార్జీలు తగ్గుతాయని పేర్నొన్నారు. ఇంధన ధరల్లో చోటు చేసుకుంటున్న హెచ్చు తగ్గుల వల్ల ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. త్వరలో వెలువడనున్న జాతీయ కొత్త పౌర విమాన విధానం వల్ల ఈ పరిశ్రమలో బృహత్తర మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. విమానంలో 500 కి.మీ ప్రయాణిస్తే రూ.2500 నుంచి రూ.3000 రూపాయల చార్జీ ఉంటే తప్పనిసరిగా విమానయాన రంగం అభివృద్ధి చెందుతుందని నివేదిక పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com