'మా' అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
- October 13, 2021హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. డ్రామాలు, విమర్శలు, ఆరోపణల మధ్య మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీ సాధించింది. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. నరేష్ నుంచి బాధ్యలను తీసుకున్న మంచు విష్ణు ఇకపై ‘మా’ అధ్యక్షుడుగా కొనసాగుతారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివబాలాజీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ రోజు ఆఫీసులో తన మొదటి రోజు ఫోటోను పంచుకుంటూ “నేను ఈరోజు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను! మీ ఆశీస్సులు కావాలి. వీలైనంత వరకు నాకు పాజిటివిటీని పంపండి” అంటూ ట్వీట్ చేశారు. అసోసియేషన్‌లోని కళాకారుల సంక్షేమం కోసం మంచు విష్ణు, అతని ప్యానెల్ సభ్యులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాలు చేశారు. ప్రెస్ మీట్ సమయంలో ప్రకాష్ రాజ్ బృందం మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి