సమంతతో తెలుగు , తమిళ భాషల్లో సినిమా

- October 16, 2021 , by Maagulf

హైదరాబాద్: సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌  తెలుగు, తమిళ  భాషల్లో ఓ సినిమా నిర్మించనున్నారు. దీనికి ఇద్దరు యువకులు హరి–హరీష్‌దర్శకత్వం వహించనున్నారు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెం 14గా తెరకెక్కనున్నఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. విజయదశమిసందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించారు.

 

శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘విభిన్న కథాంశంతో ఈ సినిమా తీస్తున్నాం. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ చిత్రమిది. బాలకృష్ణగారితో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరోమూడు చిత్రాలు చేశాను . నానితో ‘జెంటిల్‌మన్‌’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను . ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. చాలాకొత్తగా ఉంటుందీ సినిమా. సమంతగారు కథ వినగానే ఎగ్జైట్‌ అయ్యారు. వెంటనే ఓకేచెప్పారు. హరి, హరీష్‌ దర్శక ద్వయాన్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నాం. నవంబర్‌లోతెలుగు, తమిళ  భాషల్లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు.

 

త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com