దుబాయ్ వ్యాపారవేత్తను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
- October 16, 2021
హైదరాబాద్: హైదరాబాద్‌లో దుబాయ్ వ్యాపారవేత్తను హత్య చేసిన నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండలం (హైదరాబాద్) డిప్యూటీ పోలీసు కమిషనర్ (DCP) గజరావు భూపాల్ ప్రకారం.. హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన రాయీస్ జాబ్రి, ఆదిల్ జాబ్రీ, సయ్యద్ సలేహ్ జాబ్రి, సాద్ బిన్ సలేహ్ జాబ్రి దుబాయ్ వ్యాపారవేత్తను హత్య చేశారు. ప్రధాన నిందితుడు రయీస్ జాబ్రీ దుబాయ్‌లో పనిచేశాడు. 2019 లో రయీస్ జాబ్రి ఇండియాకు తిరిగి వస్తుండగా.. దుబాయ్ వ్యాపారవేత్త అతనికి తెలియకుండా కిలో బంగారం ఉన్న బ్యాగ్‌ని దుబాయ్ నుండి భారతదేశంలో డెలివరీ చేయడానికి ఇచ్చాడు. అయితే విమానాశ్రయంలో అతడిని కస్టమ్ అధికారులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో దుబాయ్ వ్యాపారవేత్త తనకు ఆర్థిక సాయం, ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడని కానీ అలా చేయలేదని, అందుకే దుబాయ్ ఎన్నారై ను కత్తితో పొడిచి చంపామని నిందితుడు రయీస్ విచారణలో చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు DCP గజరావు భూపాల్ మాగల్ఫ్ న్యూస్ కు తెలిపారు.
తాజా వార్తలు
- దిగ్విజయంగా చికాగో NATS క్రికెట్ టోర్నమెంట్
- మూడేళ్ల క్రితం తన అరెస్టును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గుదల
- బాలల నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ‘పాడనా తెలుగు పాట’
- జర్మనీ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్..
- గవర్నర్ ని కలిసిన BRS నేతలు
- బిగ్‌బాస్ హౌస్‌లోకి నందన....హోస్ట్ నాగార్జునకు వార్నింగ్!
- కొత్త ప్రభుత్వ సీజన్ పై షేక్ మహమ్మద్ సమీక్ష..
- యూఏఈకి తిరిగి వస్తున్న విజ్ ఎయిర్..
- తిరుమల బ్రహ్మోత్సవాలు ఖరారు.. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి ఉత్సవాలు







