ఇన్‌సర్టబుల్‌ కార్డియాక్‌ మానిటర్‌..

- March 18, 2016 , by Maagulf
ఇన్‌సర్టబుల్‌ కార్డియాక్‌ మానిటర్‌..

గుండెపోటును ముందుగానే గుర్తించగల పరికరం అందుబాటులోకి వచ్చేసింది. ఇన్‌సర్టబుల్‌ కార్డియాక్‌ మానిటర్‌, 1.2 సీసీ పరిమాణం కలిగిన ఈ చిన్న పరికరం మూడేళ్లపాటు గుండె స్పందనలను నమోదు చేస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటే దానికి సంబంధించిన సంకేతాలను ముందుగానే అందిస్తుంది. బెంగళూరులోని జయదేవ హృద్రోగ ఆస్పత్రి వైద్యులు దేశంలోనే మొదటిసారిగా 55 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తికి శస్త్రచికిత్స చేసి ఈ పరికరాన్ని అమర్చారు.ఆ విశేషాలను ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.మంజునాథ్‌, వైద్య నిపుణుడు డాక్టర్‌ జయప్రకాష్‌ శంతూర్‌ శనివారం మీడియాకు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త కాంతిలాల్‌ తాతేడ్‌ కొద్ది రోజులుగా అప్పుడప్పుడూ స్పృహ కోల్పోయేవారు. అడపాదడపా ఆయన ఛాతీ నొప్పితో కూడా బాధపడ్డారు. దీనికి సంబంధించి ఆయన పలు చోట్ల వైద్య పరీక్షలు చేయించుకున్నా ఫలితం కనిపించలేదు. ఈసీజీ, ఎంఆర్‌ఐ స్కాన చేయించిన తర్వాత డాక్టర్‌ జయప్రకాష్‌ శంతర్‌ను ఆశ్రయించారు. ఆయన కాంతిలాల్‌ కుటుంబ సభ్యులతో చర్చించి ఈ పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం అందించే సమాచారం ఆధారంగా తదుపరి శస్త్రచికిత్సల కోసం కాంతిలాల్‌ను సిద్ధం చేస్తామని జయదేవ ఆస్పత్రి హృద్రోగ నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com