పోలీసులపై ఆగని దాడులు
- October 18, 2021
కువైట్: పోలీసులపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న ఈ దాడులకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా రౌడా శివారులో తన కారులో ఎగ్జాస్ట్ను అమర్చుకొని వింత సౌండ్స్ చేస్తూ.. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిని పెట్రోలింగ్ పోలీస్ అడ్డుకున్నాడు. తన ID ని చూపించమని కోరాడు. అతను తిరస్కరించడమే కాకుండా తన స్నేహితులను పిలిచాడు. అందరూ కలిసి పోలీస్ అధికారి పై దాడికి దిగారు. అందులో ఒకరు పోలీస్ అధికారి వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ లాక్కునేందుకు ప్రయత్నించాడు. దీంతో సదరు పోలీసు అధికారి గాలిలో కాల్పులు జరిపాడు. భయపడ్డ నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు.. అతని కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ అధికారి పై దాడికి పాల్పడ్డ వారిలో కొందరి కార్ల నెంబర్లను గుర్తించామని, వారిని విచారణకు పిలిపించాలని భావిస్తున్నట్లు ఓ పోలీస్ అధికారి తెలిపాడు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









