ఐ-బాక్స్ స్మార్ట్ లాకర్లను ప్రారంభించిన దుబాయ్ కస్టమ్స్ విభాగం

- October 19, 2021 , by Maagulf
ఐ-బాక్స్ స్మార్ట్ లాకర్లను ప్రారంభించిన దుబాయ్ కస్టమ్స్ విభాగం

దుబాయ్: జిటెక్స్ గ్లోబల్‌లో ఇన్‌బౌండ్ ట్రాన్సిట్ ప్యాసింజర్ల కోసం తన ఐ-బాక్స్ స్మార్ట్ లాకర్లను దుబాయ్ కస్టమ్స్ ప్రారంభించింది. ‘డిజిటల్ ట్రేడ్ ఫర్ సేఫ్, సస్టైనబుల్ సప్లై చైన్స్’లో భాగంగా దుబాయ్ కస్టమ్స్ దీన్ని ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ బాక్స్ లో ప్రయాణికులు విలువైన వస్తువులను ట్యాక్స్ ఫ్రీ, డ్యూటీ ఫ్రీ చెల్లించకుండా భద్రపర్చుకునే సౌకర్యాన్ని కల్పించారు. దేశం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వీటిని తమ వెంట తీసుకెళ్లవచ్చు.

లాజిస్టిక్స్, హ్యాండ్లింగ్ సేవలను ఐ-బాక్స్ స్మార్ట్ లాకర్స్ ప్రాజెక్ట్ మరింత వేగవంతం చేస్తుంది. ఐ-బాక్స్ ను ప్యాసింజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా ఆపరేట్ చేయొచ్చు. పేపర్ లెస్, కాంటాక్ట్ లెస్ గా ఈ మొత్తం ప్రక్రియ సాగుతుందని దుబాయ్ కస్టమ్స్, ప్యాసింజర్ ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్ ఇబ్రహీం అల్ కమలి చెప్పారు.

యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలను అనుసరించి స్మార్ట్ పథకాలను తీసుకొచ్చినట్టు దుబాయ్ కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ మహబూబ్ ముసాబిహ్ తెలిపారు. ఇలాంటి స్మార్ట్ పథకాలు డిజిటల్ రంగంలో దుబాయ్ ని ఉన్నతంగా నిలబెడతాయని, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు దోహదం చేస్తాయన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com