ఎన్.ఆర్.ఐ శ్రీనివాసు వడ్లమానికి సత్కారం

- October 19, 2021 , by Maagulf
ఎన్.ఆర్.ఐ  శ్రీనివాసు వడ్లమానికి సత్కారం

హైదరాబాద్: చార్లెట్, నార్త్ కెరోలినా, అమెరికాకు చెందిన మానవతావాది గాయకులు శ్రీనివాస్ వడ్లమాని  వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్ వారు, వారి కార్యాలయంలో ఘనంగా సత్కరించారు.వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, హ్యూస్టన్,  టెక్సాస్ వారు, వారి 95వ ప్రచురణగా ముద్రించిన 'లిటిల్ డిటెక్టివ్' నవలిక ముద్రణకు శ్రీనివాస్ వడ్లమాని, లక్ష్మీ పద్మజ వడ్లమాని సహకరించారని, లిటిల్ డిటెక్టివ్ నవలా రచయిత్రి, పూర్వ సెన్సార్ బోర్డు మెంబరు, డాక్టర్ తెన్నేటి సుధాదేవి, తమ హర్షం ప్రకటిస్తూ 'లిటిల్ డిటెక్టివ్' నవల  బహూకరిస్తూ ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా వంశీ  సంస్థల అధినేత శిరోమణి, డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ, శ్రీనివాస్ వడ్లమాని మాతృభాషను, మాతృదేశాన్ని మరవకుండా తెలుగు భాషకు చేస్తున్న సేవ ప్రశంసనీయమని అన్నారు.వారు వంశీ వేగేశ్న ఫౌండేషన్ ఆశ్రమాలలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయాన్ని, షిరిడి సాయిబాబా దేవాలయాన్ని, ఘంటసాల గుడిని, దివ్యాంగుల ఆశ్రమాన్ని, సందర్శించి, వేగేశ్న ఫౌండేషన్ చెయిర్ పర్సన్, వంశీ కల్చరల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, మేనేజింగ్ ట్రస్టీ, శైలజ సుంకరపల్లి సేవలను అభినందించారు.. స్వర్ణోత్సవాలలోకి  అడుగిడుతున్న వంశీ ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్, ప్రపంచ వ్యాప్తంగా ఇస్తున్న ప్రోత్సాహం ప్రశంసనీయమని శ్రీనివాస్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com