బహ్రెయిన్ - ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష

- October 20, 2021 , by Maagulf
బహ్రెయిన్ - ఒమన్ ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష

బహ్రెయిన్:  బహ్రెయిన్ పరిశ్రమ, వాణిజ్యం, పర్యాటక శాఖ మంత్రి జాయెద్ బిన్ రషీద్ అల్జయానీ.. ఒమన్ వాణిజ్య, పారిశ్రామిక, పెట్టుబడి ప్రోత్సాహక మంత్రి కైస్ బిన్ మహ్మద్ అల్ యూసఫ్‌తో సమావేశమయ్యారు. బహ్రెయిన్ - ఒమన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై  ఇరువురు సమీక్షించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు ఉద్దేశించిన అన్ని కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా అల్జయానీ స్పష్టం చేశారు. వాణిజ్యం, పరిశ్రమ కమిటీల సమావేశాలు, జీసీసీ మార్చ్ కు సంబంధించిన సమస్యలతో పాటు, ద్వైపాక్షిక సంబంధాలు, ఉమ్మడి సహకారం లాంటి అంశాలను ఇరు దేశాల ప్రతినిధులు సమీక్షించారు. ఈ జీసీసీ వాణిజ్య మంత్రుల సమావేశంలో బహ్రెయిన్ వాణిజ్యశాఖ అండర్ సెక్రటరీ ఎమాన్ అహ్మద్ అల్ దోసర్, అసిస్టెంట్ అండర్ సెక్రటరీ షేక్ హమద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com