గల్ఫ్ దేశాల్లోని కోవిడ్ యాప్ అప్లికేషన్స్ కు గల్ఫ్ కోఅపరేషన్ కౌన్సిల్ గుర్తింపు!

- October 23, 2021 , by Maagulf
గల్ఫ్ దేశాల్లోని కోవిడ్ యాప్ అప్లికేషన్స్ కు గల్ఫ్ కోఅపరేషన్ కౌన్సిల్ గుర్తింపు!

మనామా: గల్ఫ్ కోఅపరేషన్ కౌన్సిల్ లోని దేశాలన్నింటి కోవిడ్ 19 యాప్ అప్లికేషన్స్ ను ఆయా దేశాలన్ని గుర్తించనున్నాయి. ఒక్కో దేశం ఒక్కో కరోనా యాప్ అప్లికేషన్ ను వాడుతున్నాయి. ఐతే గల్ఫ్ దేశాలు అన్నింటికి ఓకే అప్లికేషన్ ఉండాలన్న ఉద్దేశంతో అన్ని దేశాల అప్లికేషన్స్ ను అనుమతించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ద్వారా గల్ఫ్ లో ఉండే ఏ దేశం కరోనా యాప్ నైనా మిగతా గల్ఫ్ దేశాల్లో అనుమతిస్తారు. అంటే ఆ యాప్ లో ఉండే వివరాలను ఇతర గల్ఫ్ దేశాల్లోనూ అనుమతిస్తారు.మనామా లో జరిగిన జీసీసీ హెల్త్ మినిస్టర్స్ మీటింగ్ లో ఈ  అన్ని దేశాల హెల్త్ మినిస్టర్స్ ఈ సూచన చేశారు. ఐతే  ఇందుకు సంబంధించి త్వరలోనే అగ్రిమెంట్ చేసుకోనున్నాయి. జీసీసీ జనరల్ సెక్రటరీస్ ఈ అగ్రిమెంట్ పూర్తయ్యేందుకు కృషి చేస్తారని బహ్రెయిన్ హెల్త్ మినిస్టర్ ఫక్వా బింట్ అల్ సలేహా తెలిపారు. జీసీసీ మీటింగ్ లో భాగంగా నేషనల్ కాంటాక్ట్ సెంటర్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. అదే విధంగా జీసీసీ హెల్త్ మినిస్టర్స్  మీటింగ్ లో పబ్లిక్ హెల్త్ ప్లాన్ కు సంబంధించిన ఫ్రేమ్ వర్క్, ఎర్లీ హెల్త్ వార్నింగ్ సిస్టమ్, గల్ఫ్ సెంటర్ ఫర్ డిసీసెస్ ప్రివెన్షన్ ఏర్పాటు పై చర్చించామన్నారు. అన్ని దేశాల హెల్త్ మినిస్టర్లు హెల్త్ సేప్టీ విషయంలో గల్ఫ్ దేశాల మధ్య సహకారంతో పాటు అంతర్జాతీయంగానూ అన్ని దేశాలతో సఖ్యత మెయింటెన్ చేయాలని కోరారని ఆయన అన్నారు. ఇక  గల్ఫ్ కోఅపరేషన్ కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ సులేమాన్ బిన్ సలేహ్ అల్ దకిల్ మాట్లాడుతూ జీసీసీ హెల్త్ కౌన్సిల్ ప్లాన్స్ ను ప్రధానంగా చర్చించామన్నారు. పలు తీర్మానాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ను సిద్దం చేశామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com