ఐడీఎఫ్, ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో హెల్త్ సెమినార్
- October 23, 2021
కువైట్: ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్, (IDF) ఇండియన్ ఎంబసీ సంయుక్తంగా హెల్త్ సెమినార్ కండక్ట్ చేశాయి. ఈ సెమినార్ లో ప్రముఖ డాక్టర్స్ తమ విలువైన అనుభవాలను పంచుకున్నారు. ఆరోగ్యకరమైన జీవితానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. డాక్టర్ మధు గుప్తా ఆధ్వర్యంలో సెంటిఫిక్ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ లో ప్రముఖ డాక్టర్లు డాక్టర్ రిఫత్ జెహన్, డాక్టర్ తన్ సీమ్ జాస్వీ, డాక్టర్ సుసోవానా నాయర్, డాక్టర్ తన్ సీమ్ అమీర్ తమ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. వైద్య రంగంలో భవిష్యత్ లో ఎదురయ్యే సవాళ్లు, అవకాశాలపై చర్చించారు. ఈ సెమినార్ లో దాదాపు 100 మందికి పైగా మహిళకు ఫ్రీ గా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు చేశారు. భారత రాయబారితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హెల్త్ విషయం ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐడీఎఫ్ ఎంతగానో కృషి చేస్తుందని ఐడీఎఫ్ ప్రెసిడెంట్ అమీర్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







