దుబాయ్లో దీపావళి సంబరాలు, ప్రత్యేక ఆఫర్లు, ఎక్స్పో 2020 షోలు
- October 23, 2021
దుబాయ్: దీపావళి అంటేనే దీపాల వెలుగుల పండుగ. దుబాయ్లో ఈ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దుబాయ్ ఫెస్టివల్స్ మరియు రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాల్ని అందుబాటులోకి తెస్తుంది. దుబాయ్ షాపింగ్ మాల్స్ గ్రూపుగా కలిసి గోల్డెన్ దివాళీ ఆకర్షణల్ని అందించనుంది. 100,000 దిర్హాముల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. ‘సిటీ ఆఫ్ గోల్డ్ దివాళీ గ్లో’ పేరుతో ఆభరణాలు కొనుగోలు చేసేవారికి బహుమతులు అందించనున్నారు. 150,000 దిర్హాములు విలువైన జ్యూయలరీ ఓచర్లను గెలుచుకునే అవకాశం ఉంది. ఫెస్టివ్ ప్లాజా, సిటీ సెంటర్ డేరా, సిటీ సెంటర్ అల్ షిందగా, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, గ్లోబల్ విలేజ్, ఎక్స్పో 2020 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆకర్షణలు ఈ దీపావళికి సందర్శకులు, అలాగే కొనుగోలుదార్లకు సరికొత్త అనుభూతిని అందించనున్నాయ్. ఫిలిం ఫేర్ మిడిల్ ఈస్ట్ అచ్చీవర్స్ నైట్, దుబాయ్ డిజైనర్స్ వీక్ వంటివి ఇతర ప్రధాన ఆకర్షణలు. ఫైర్ వర్క్స్ కూడా ఈ ఏడాది అందర్నీ అలరించేందుకు సిద్ధమవుతున్నాయ్.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







