దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ
- October 23, 2021
_1635006024.jpg)
_1635006005.jpg)
యూఏఈ: తెలంగాణ పూల పండుగ బతుకమ్మ నేడు ప్రపంచ దృష్టిలో పడింది. ప్రపంచ ప్రఖ్యాత 'బుర్జ్ ఖలీఫా' పై బతుకమ్మ పాటను ప్రదర్శించి యావత్ తెలుగు ప్రజల మన్నలను అందుకున్నారు కల్వకుంట్ల కవిత. ఈ ప్రదర్శనలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు యూఏఈ లోని తెలుగు ప్రజలు పెద్దఎత్తున రావటం జరిగింది. తమ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ ను ఇలా ప్రపంచపు స్క్రీన్ పై చూడటం నిజంగా ఒక గొప్ప అనుభూతి అని ప్రజలు కొనియాడారు.
షుమారు మూడు నిమిషాల నిడివి గల ఈ షో ను రెండు సార్లు ప్రదర్శించి ప్రతి ఒక్కరు చూసే విధంగా ఏర్పాటు చేయటం జరిగింది.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎంపీ సురేష్ రెడ్డి, పీయూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, జాజాల సురేందర్, షకీల్, డా. సంజయ్, తెలంగాణ సంఘాలు మరియు జాగృతి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



_1635006050.jpg)


తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







