హట్టాలో పర్యటించిన దుబాయ్ రాజు షేక్ మహ్మద్..

- October 24, 2021 , by Maagulf
హట్టాలో పర్యటించిన దుబాయ్ రాజు షేక్ మహ్మద్..

దుబాయ్: దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్‌లో అంతర్భాగమైన హట్టా మాస్టర్ డెవలప్‌మెంట్ ప్లాన్‌కు వైస్ ప్రెసిడెంట్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మహ్మద్ శనివారం ఆమోదం తెలిపారు. "ఎంటర్ టైన్ మెంట్, హెల్త్, టూరిజం రంగాల్లో హట్టాను ప్రత్యేకమైన పర్యాటక కేంద్రంగా మార్చడమే ఈ ప్లాన్ లక్ష్యం. యువత క్రియేటివ్ ఆలోచనలతో హట్టా ఆర్థిక సామర్థ్యం పెరుగుతుంది. ప్రైవేట్ రంగంలోని మా భాగస్వాములు హట్టాలో ఆశాజనక ఉపాధి అవకాశాలను సృష్టించే పెట్టుబడులను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తారు.’’ అని షేక్ మహ్మద్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

హట్టా పర్యటనలో షేక్ మహ్మద్ వెంట దుబాయ్ యువరాజు, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌, దుబాయ్ డిప్యూటీ పాలకుడు, ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి  షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ మీడియా కౌన్సిల్ చైర్మన్ షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేక్ మన్సూర్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ గెర్గావి ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com