కన్స్ట్రక్షన్ వరల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరిన ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్
- October 24, 2021
హైదరాబాద్: కన్స్ట్రక్షన్ వరల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి చేరారు.ముంబైలో అక్టోబర్ 22వ తేదీన కన్స్ట్రక్షన్ వరల్డ్ నిర్వహించిన 7వ భారతీయ నిర్మాణ రంగ పండుగ రజతోత్సవ వేడుకలో ఈ అంశాన్ని వెల్లడించారు.
కన్స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020గా వెలుగొందుతున్న కెవీబీ రెడ్డిని ఇతర కన్స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్స్‌తో పాటుగా సత్కరించడంతో పాటుగా పరిశ్రమకు అందించిన తోడ్పాటుకు గానూ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు.
ఈ గుర్తింపు అందుకోవడం గురించి ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ ఎండీ అండ్ సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ గుర్తింపునందించిన కన్స్ట్రక్షన్ వరల్డ్‌కు ధన్యవాదములు తెలుపుతున్నాను. అత్యుత్తమ సమాచారం మరియు కనెక్షన్స్ అందిస్తూ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న కన్స్ట్రక్షన్ వరల్డ్‌ను అభినందిస్తున్నాను. పరిశ్రమలో మహోన్నత వ్యక్తుల సరసన నిలువడమే ఓ గౌరవం మరియు బాధ్యత. నా వెనుక శిలలా తోడుండి, అవిశ్రాంతంగా తోడ్పాటునందించిన మా బృందానికి ఈ గుర్తింపును అంకితం చేస్తున్నాను. ఈ బృందమే, మహమ్మారి విసిరిన సవాళ్లను సైతం అధిగమించి ముందుకు సాగడంలో తోడ్పడటంతో పాటుగా మా ప్రయాణీకులకు అత్యంత సురక్షితమైన రవాణా అవకాశం అందించింది’’ అని అన్నారు.
ఎల్ అండ్ టీ గ్రూప్‌లో 2018లో చేరిన దగ్గర నుంచి హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఎన్నో విజయాలను ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి తీసుకువచ్చారు. సేకరణ, ప్రాజెక్ట్ కో ఆర్డినేషన్, డెవలప్మెంట్, ఆపరేషన్స్, మెయిన్టెనెన్స్, బిజినెస్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, ఈపీసీ, ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ , కమర్షియల్ అండ్ బిజినెస్ స్ట్రాటజీ, స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ వంటి రంగాలలో మూడున్నర దశాబ్దాలు అనుభవం ఆయన తనతో పాటుగా తీసుకువచ్చారు.
కెవీబీ రెడ్డి, పలు అవార్డులను వ్యక్తిగత, వృత్తి పరంగా అందుకున్నారు. ఆయన అందుకున్న ఇతర అవార్డులలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ నుంచి 2018, 2019లలో ఔట్‌స్టాండింగ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు వంటివి కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







