వీధి వ్యాపారులకు రూల్స్ పై అవగాహన కార్యక్రమం
- October 24, 2021
అల్ షీహనియా: వీధి వ్యాపారులకు రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అల్ హీహనియా మున్సిపాలిటీ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు. స్థానిక వ్యవసాయ కార్మికులుండే వీధిలో ప్రత్యేకంగా ఈ అవేర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీధి వ్యాపారం చేసుకునేందుకు కచ్చితంగా లైసెన్స్ ఉండాలని ఈ సందర్భంగా అధికారులు వారికి వివరించారు. వ్యాపార నిబంధనలకు సంబంధించిన 10 రూల్స్ ను అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ప్రతి రోజు సాయంత్రం వ్యాపారం ముగిసిన తర్వాత వ్యాపార బండి దగ్గర పోగైన చెత్తను తొలగించాలని కోరారు. అదే విధంగా పలువురి స్ట్రీట్ వెండర్స్ లైసెన్స్ లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ, జనరల్ క్లీన్ నెస్ డిపార్ట్ మెంట్ అధికారులు, స్థానిక మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక చర్యలు: సిపి రాజశేఖరబాబు
- 14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్
- ఇరాన్ వీడాలని భారతీయులకు కేంద్రం ఆదేశం..
- ఇరాన్ 10 షరతులు ఇవే..
- వడ్డీరేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం..
- టెంపుల్ టూరిజం పై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
- గాజువాక మౌనిక హత్య కేసులో ట్విస్ట్..
- క్రూడాయిల్ ధరలు ఢమాల్
- సౌదీ అరేబియాలో పెరగనున్న సాధారణ ఉష్ణోగ్రతలు..!!
- KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!









