టీ20 వరల్డ్ కప్: పాకిస్తాన్ టార్గెట్ 152
- October 24, 2021
దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను పాక్ బౌలర్లు మొదట్లో భయపెట్టారు. తొలి ఓవర్‌లోనే రోహిత్‌ను వెనక్కి పంపి భారత శిబిరంలో కల్లోలం రేపారు.
ఆ తర్వాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. 31 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన వేళ క్రీజులోకి వచ్చిన పంత్‌తో కలిసి కోహ్లీ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. ఇద్దరూ క్రీజులో కుదురుకున్నాక స్కోరు పెంచడంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బ్యాట్ ఝళిపించిన పంత్ రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాది స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించాడు.
ఈ క్రమంలో షాదాబ్ ఖాన్ బౌలింగులో భారీ షాట్‌కు యత్నించి అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మొత్తం 30 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. పంత్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన జడేజా 13 పరుగులే చేసి అవుటయ్యాడు. మరోవైపు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.
49 బంతులు ఎదుర్కొన్న విరాట్ 5 ఫోర్లు, సిక్సర్‌తో 57 పరుగులు చేశాడు.మరోవైపు, భారీ షాట్లతో అలరిస్తాడనుకున్న పాండ్యా 11 పరుగులే చేసి అవుటయ్యాడు. పాక్ బౌలర్లలో షహీన్ ఖాన్ 3 వికెట్లు తీయగా, హసన్ అలీ 2, షాదాబ్ ఖాన్, రవూఫ్ చెరో వికెట్ తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం