ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు..
- October 25, 2021
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. రోమ్‌లో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొంటారు.ఈ నెల 29 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని మోదీ. ఇటలీ, బ్రిటన్‌లో పర్యటించనున్న ప్రధాని.. 6వ జీ-20, కాప్-26, వరల్డ్ లీడర్స్శిఖరాగ్ర సమావేశాలకు హాజరుకానున్నారు. మొత్తం 5 రోజులపాటు విదేశాల్లో ఉండనున్న మోదీ.. మొదట రోమ్‌కు వెళతారు. ఈనెల 30, 31వ తేదీల్లో ఇటలీ ప్రధాని అధ్యక్షతన జరగనున్న జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు.
ఇందులో కరోనా మహమ్మారి విలయం, ఆరోగ్యం విషయాల్లో అంతర్జాతీయ సహకారం, ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. జీ-20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రభుత్వ అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం ఇది 8వ సారి. 2023లో ఈ సమావేశానికి భారత్ వేదిక కాబోతోంది. జీ-20 సమ్మిట్ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ అక్కడ నుంచి స్కాట్లాండ్‌లోని గ్లాస్కోకు బయలుదేరుతారు. అక్కడ ఈనెల 31 నుంచి నవంబర్ 12 వరకు జరగనున్న కాప్-26 సదస్సుకు హాజరవుతారు. నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగే వరల్డ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు ప్రధాని మోదీ. ఆ తరువాత భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్‌కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







