ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?

- December 29, 2025 , by Maagulf
ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?

యూఏఈ: ఫాస్ట్ డిజిటల్ రుణాల కల్చర్ ఇటీవల వేగంగా పెరుగుతోంది.  బ్యాంకులు తమ కస్టమర్లకు వేగంగా రుణాలను క్షణాల్లో మంజూరు చేస్తున్నాయి. అయితే, నెలవారీ ఆదాయంపై కాకుండా ఇప్పటికే ఉన్న రుణాలను తిరిగి చెల్లించడానికి కొత్త క్రెడిట్‌ లోన్స్ పై ఆధారపడినప్పుడు అవి రిస్క్ గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు.  

స్వల్పకాలిక డిజిటల్ రుణాలను నిజమైన అత్యవసర పరిస్థితుల కంటే అద్దె, యుటిలిటీలు లేదా ట్యూషన్ ఫీజులు వంటి సాధారణ ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగించినప్పుడు రిస్క్ పెరుగుతుందని http://Paisabazaar.ae చీఫ్ బిజినెస్ ఆఫీసర్ బ్రిజేష్ కుమార్ అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, గిగ్ వర్కర్లు మరియు తక్కువ ఆదాయం సంపాదించేవారు ఆర్థికంగా ఇబ్బందులు పడతారని తెలిపారు.

అలాగే, అధిక ప్రాసెసింగ్ ఫీజులు మరియు జరిమానాలు వంటివి అధిక మొత్తంలో చెల్లించేలా చేస్తాయని అన్నారు.  బ్యాంకింగ్ రుణాల కోసం యూఏఈ బలమైన నియంత్రణ చట్రాన్ని కలిగి ఉన్నప్పటికీ, అమలు స్థాయిలో సవాళ్లు విసురుతూనే ఉంటాయని అన్నారు.  

ఈఎంఐ చెల్లింపుల్లో జాప్యం కారణంగా భవిష్యత్తులో హోం లోన్స్ వంటి ప్రధాన ఫైనాన్సింగ్‌కు ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉందని  జవాబ్ ఎకనామిక్ & మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫారిస్ అలీ వెల్లడించారు. ఆర్థిక విద్యపై అవగాహనను కల్పించడం ద్వారా ఇలాంటి రిస్క్ లను తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com