విజిట్ వీసా గడువు నవంబర్ 30 వరకు పొడగింపు
- October 25, 2021
సౌదీ అరేబియా:విజిట్ వీసా పై వచ్చి సౌదీ లో చిక్కుకుపోయిన ఇతర దేశాల వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి అందరి విజిట్ వీసాల గడువును నవంబర్ 30 వరకు పొడిగస్తున్నట్లు సౌదీ విదేశాంగ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్ కారణంగా చాలా దేశాలు సౌదీకి వెళ్లిన వారి దేశస్తులను డైరెక్ట్ గా మళ్లీ తమ దేశంలోకి అనుమతించలేదు. ట్రావెల్ బ్యాన్ నిబంధనల కారణంగా చాలా మంది సౌదీకి వచ్చి తిరిగి వారి దేశాలకు వెళ్లలేకపోయారు. అలాంటి వారికి ఊరటనిచ్చేలా సౌదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీసా గడువు పొడగింపు ఆటోమేటిక్ గా జరుగుతుందని దానికోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఐతే ఈ అవకాశం ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటోన్న దేశాల వాసులకు మాత్రమేనని స్పష్టం చేసింది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







