పాసులు లేనివారు ఆడియో కి ఫంక్షన్ రావొద్దు:పవర్ స్టార్

- March 19, 2016 , by Maagulf
పాసులు లేనివారు ఆడియో కి ఫంక్షన్  రావొద్దు:పవర్ స్టార్

సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల సందర్భంగా హీరో పవన్ కల్యాణ్ ..తన అభిమానులకు ఓ విన్నపం చేశారు. పాసులు లేనివారు దయచేసి ఆడియో ఫంక్షన్ కు రావద్దొంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. మెగాస్టార్ చిరంజీవి సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా వస్తున్నారని, ఆయన చేతులు మీదగా ఆడియో రిలీజ్ అవుతుందని పవన్ కల్యాణ్ తెలిపారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో విడుదల కార్యక్రమం రేపు సాయంత్రం నోవాటెల్ హోటల్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 'సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా నిన్నటి వరకూ ఆడియో ఫంక్షన్ చేయాలా వద్దా అనేది ఉంది.


ఓ దశలో ఫంక్షన్ క్యాన్సిల్ చేసేయమని నిర్మాత శరత్ మరార్ కు చెప్పాను కూడా. ఆడియో ఫంక్షన్ కు అభిమానులు పెద్దసంఖ్యలో వస్తే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నా అభిమానులకు ఒకటే విన్నపం. దయచేసి పాస్ లు ఉన్నవారే ఆడియో ఫంక్షన్ కు రండి.మిగతావాళ్లు టీవీల్లోనే చూడండి. అభిమానుల పేరుతో అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే పాసులు లేనివారు రావద్దు' అని సూచించారు. రాజకీయాల గురించి మాట్లాడేదేమీ లేదని, కేవలం సినిమా ఆడియో రిలీజ్ గురించే ప్రెస్ మీట్ పెట్టినట్లు పవన్ తెలిపారు. ఆయన ఈ సందర్భంగా ఆడియో ఫంక్షన్ నిర్వహణకు సహకరించిన సైబరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com