ప్రపంచంలో నంబర్ వన్ స్పేస్ ఈవెంట్ నేడే ప్రారంభం

- October 25, 2021 , by Maagulf
ప్రపంచంలో నంబర్ వన్ స్పేస్ ఈవెంట్ నేడే  ప్రారంభం

యూఏఈ:ఇంటర్నేషనల్ అస్ట్రానాటికల్ కాంగ్రెస్ (IAC) ఆధ్వర్యంలో జరగనున్న ప్రపంచంలోనే అతిపెద్ద స్పేస్ ఈవెంట్ ఇవ్వాళ ప్రారంభం కానుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఈ ఈవెంట్ ను ప్రారంభించనున్నట్లు ఐఏసీ అధికారులు తెలిపారు. మొత్తం 5 రోజులు పాటు అంటే అక్టోబర్ 29 వరకు ఈ స్పేస్ ఈవెంట్ జరగనుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇంత పెద్ద స్పేస్ ఈవెంట్ ను నిర్వహించటం ఇదే తొలిసారి. ఈ ఏడాది 4 వేల మంది ఈవెంట్ చూసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 90 సంస్థలు తమ వస్తువులను ప్రదర్శనకు ఉంచనున్నాయి. 110 దేశాల నుంచి  దాదాపు 350 మంది అంతరిక్ష రంగంలో నిపుణులు ఇందులో పాల్గొననున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com