ప్రవాసీయులకు ఊరట..కోవాక్సిన్ తీసుకున్నవారిని ఎట్టకేలకు అనుమతించనున్న ఒమాన్
- October 27, 2021
ఒమాన్: భారత దేశీయ వ్యాక్సిన్ కోవాక్సిన్ తీసుకున్నవారు రాకపై ఇతర దేశాలు నిర్బంధం విధించిన సంగతి తెలిసిందే. దీనికి కారణం నుండి రాన్ని ఎమర్జెన్సీ అప్రూవల్. అయితే, వీరికి ఊరట కలిగించే వార్త ప్రకటించింది ఒమాన్. ఒమాన్ ఆమోదించబడింది వ్యాక్సిన్ల జాబితాలో కోవాక్సిన్ ను చేరుస్తున్నట్టు తెలిపింది.
కోవాక్సిన్ తీసుకున్నవారిని క్వారంటైన్ అవసరం లేకుండానే భారత్ నుండి సుల్తానేట్ లోకి అనుమస్తున్నట్టు ఒమాన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అయితే, ప్రయాణించే సమయానికి 14 రోజుల ముందు రెండు డోస్ కోవాక్సిన్ తీసుకొని ఉండడటం తప్పనిసరి.
దీనితోపాటు అన్ని ఇతర కోవిడ్ సంబంధిత షరతులు అనగా, ప్రయాణించే ముందు RT-PCR పరీక్షలు వంటివి ప్రయాణీకులకు వర్తిస్తాయి" అని రాయబార కార్యాలయం తెలిపింది. ఆస్ట్రాజెనెకా - కోవిషీల్డ్ జబ్స్‌తో ఇంజెక్ట్ చేయబడిన ప్రయాణీకులు నిర్బంధం లేకుండా ఒమన్‌కు రావడానికి ఇప్పటికే అనుమతించబడ్డారు.
ఒమాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోవాక్సిన్‌ని తీసుకున్న భారతీయులు మరియు ఇతర జాతీయులకు ఒమన్‌కు ప్రయాణాన్ని గణనీయంగా సులభతరం చేస్తుంది. కోవాక్సిన్ ఆమోదం పొందడంలో సహకరించినందుకు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒమన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమాన్)
తాజా వార్తలు
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం